నర్సాపూర్: రైతులందరికీ రుణమాఫీ చేయాలని బిఆర్ఎస్ నాయకుల ఆందోళన
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన చేశారు. రైతుబంధు వానాకాలం పంటలకు అమలు చేయాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.