మెదక్ జిల్లా మాసాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు సూచించరు