మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవోకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు, మాజీ సర్పంచ్, కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ. ఇందిరమ్మ కమిటీలను గ్రామ సభ నిర్వహించకుండా కమిటీలు వేశారు. ఇలాంటి కమిటీల వల్ల అక్రమాలు జరుగుతాయని, ఆ కమిటీలను రద్దు చేసి గ్రామ సభ నిర్వహించి, కమిటీలను వేయవలసిందిగా కోరారు.