మెదక్: ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇవ్వాలి.. ఎమ్మెల్యే

82பார்த்தது
మెదక్ జిల్లా ఉసిరికపల్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా శుక్రవారం ఎమ్మెల్యే సునితారెడ్డి మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం చెప్పారు. అదేవిధంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం తరఫున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி