తూప్రాన్ మండలం కిష్టాపూర్ లో భూమోల్ల పోచయ్య ఇటీవల మృతి చెందారు. భార్య కమలమ్మ, కొడుకు స్వామి, కోడలు నవనీత, బిడ్డలు అల్లుళ్లతో పెద్దలకు పండగ చేశారు. పండగ చేయడంతో బాణామతి చేస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తూ.. మృతుడి ఆత్మ తిరుగుతుందని పూనకాలు ఊగారు. అనంతరం ముగ్గురిపై కులస్తులు దాడి చేసి గాయపరిచారు. బాధితులు తూప్రాన్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు.