మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మద్యం షాపులో గత రాత్రి చోరీ జరిగింది. నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న బృందావన్ వైన్స్ లో గుర్తు తెలియని దుండగులు గోడ ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సుమారు రూ. 40, 000 విలువైన మద్యం సీసాలను చోరీ చేసినట్లు శనివారం పోలీసులకు యజమానులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.