మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి చెరువులో మత్స్యకారులకు వింత చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపలు చెరువులో ఉన్న చేపలను మొత్తం తినేస్తున్నాయని వీటి వల్ల తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతినిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన చేప పిల్లల్లోనే ఇటువంటి చేపలు వచ్చాయని ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి చేపలు చెరువులో లభ్యం కాలేదని ఆరోపిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.