మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఈ వానకాలం పంటకి రైతు భరోసా కింద ఎకరానికి 7500 తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.