మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జరగలేదని, సోమవారం రైతులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి తరలి వెళ్లిన రైతులు సుమారు 400 పైగా రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ప్రకటించిన రుణమాఫీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.