ఉద్యోగుల భవిష్యనిధి ఆధ్వర్యంలో నిధి ఆప్ కె నిఖట్ పై అవగాహన
ఉద్యోగుల భవిష్యనిధి సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్లోని సెయింట్ పీటర్ పాఠశాలలో 'నిధి ఆప్ కె నిఖట్-2. 0'పై అవగాహన, ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్దిపేట శాఖ కమిషనర్ అవినాష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పీఎఫ్ ఖాతాదారులు, పింఛనుదారులు, యజమానులు తమ ఫిర్యాదులను అందజేసి, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు.