మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని శుక్రవారం మహాకాల్ ఆలయ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా , పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా ఆలయ గోడ కూలినట్లు తెలుస్తోంది.