సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డా. యాదవరెడ్డి అన్నారు. మంగళవారం కొండపాక మండలంకి చెందిన అయిదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన చేతులమీదుగా బీఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపాక మండలంకి చెందిన ఐదుగురు నిరుపేదలకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.