బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతి పత్రం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లపు నర్సింలు, తెలంగాణ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి దేశెట్టి యాదగిరి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బలమైన శ్రీనివాస్ యాదవ్, వెంకటాచారి పాల్గొన్నారు.