యూపీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడా సూరజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూలర్ తయారీ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.