నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జగన్నాథం.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. సోమవారం మ. 3 గంటలకు సంతోష్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.