మంచిర్యాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడ వద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ కౌంటింగ్ సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని కోరారు.