రేపటి నుంచి 28 వరకు జరగనున్న ఎస్ఏ 1 పరీక్షలను పక్కాగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య తెలిపారు. మంచిర్యాలలో శనివారం మాట్లాడుతూ ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆయా తేదీల్లో సంబంధిత పరీక్షలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే ప్రాథమిక తరగతులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు లీకేజీకి పాల్పడితే పాఠశాలలు, ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.