ఇకపై రోజుకు 2. 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలని అన్ని గనుల జనరల్ మేనేజర్లకు సింగరేణి సంస్థ సీఎండి బలరాం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి నేపథ్యంలో సింగరేణిలోని అన్ని ఏరియాలో నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలువ ఉన్న నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సూచించారు.