మందమర్రి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం పట్టణ సీఐ శశిధర్ రెడ్డి సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగిన ప్రాంతాలను నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. వాహనదారులు రహదారి భద్రతా చర్యలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్ నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.