మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్డుకు చెందిన ఠాకూర్ కిరణ్ సింగ్ అదృశ్యమైనట్లు సిఐ ప్రమోదరావు తెలిపారు. కిరణ్ సింగ్ (27) పట్టణంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 17న సాయంత్రం నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో చెన్నై వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి బాలాజీ ఫిర్యాదుతో శనివారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.