మంచిర్యాలలో గురువారం సూపర్ స్పెషాలిటీ, మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణ భూమి పూజకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నారు. ఈ నేబద్యంలో భద్రత ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్, భూమి పూజ జరిగే ప్రాంతం, బహిరంగ సభ వేదికను సందర్శించారు. రూట్ మ్యాప్ పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు.