శ్రీరాంపూర్ ఏరియా ఏఐటీయూసి మైనింగ్ స్టాఫ్ బ్రాంచ్ కార్యదర్శి మారపెల్లి బాబు మంగళవారం ఐఎన్టీయూసీలో చేరారు. బ్రాంచ్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు అధ్వర్యంలో యూనియన్ లో చేరిన ఆయనకు తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనక్ ప్రసాద్ నాయకత్వంలోనే కార్మిక వర్గ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ఐఎన్టీయూసీలో చేరినట్లు తెలిపారు.