కలమడుగు గంగ స్నానానికి జన్నారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం కలమడుగు ప్రాంతానికి ప్రజలు జాతరల కదిలి వస్తారు. కవ్వాల్ గ్రామానికి చెందిన శివ భక్తురాలు భోజనపు రజిత ఇక్కడ ప్రాంతం గురించి అడుగగా ప్రతి సంవత్సరం మేము కలమడుగు గంగ స్నానానికి వస్తాము అన్నారు. ఇక్కడికి ప్రజలు పెద్ద జాతరలా వస్తారని తెలిపారు.