జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి నది ఒడ్డున ఏమునూరు రాజేశం (26) పురుగు మందు తాగి శనివారం ఆత్మహత్య పాల్పడినట్లు ఎస్సై తానాజీ నాయక్ తెలిపారు. వడ్రంగి పని చేసే రాజేశం గత కొన్ని రోజులుగా మద్యానికి బానిస అయ్యాడు. డబ్బులు తీసుకున్న వారికి సక్రమంగా వడ్రంగి పని చేయకుండా తప్పించుకుని తిరిగేవాడు. ఈ క్రమంలో పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.