విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసిపి ప్రకాష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా మెడికల్ కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం చట్టరిత్యా నేరమని, ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే శిక్షార్హులు అవుతారన్నారు.