ప్రాణహిత, కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి డిమాండ్ చేశారు. గురువారం చెన్నూర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ పంటలను ద్వంసం చేయడం మానుకోవాలన్నారు. వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కుల వివక్షను నిర్మూలించాలని డిమాండ్ చేశారు.