జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన కొయ్యడ దేవేంద్ర ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమెకు ఉన్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసి ద్వారా రూ.5, 87, 250/- రూపాయల బీమా మంజూరు కావడం జరిగింది. ఈ బీమా మొత్తాన్ని నామిని అయిన మృతురాలు కుమారుడు కొయ్యడ రాజ్ కుమార్ కి ఆ సంస్థ ఏజిఏం అట్ల సురేష్ , గ్రామ సర్పంచ్ నర్సయ్య, ఏజెంట్ రమేష్ చేతుల మీదుగా టేకుమట్ల గ్రామ పంచాయితీ కార్యాలయంలో మంగళవారం ఉదయం అందించడం జరిగింది.