మంచిర్యాల జిల్లాలో ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తెలిపారు. మంచిర్యాలలోని
ఎన్టీఆర్ నగర్లో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమిరిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బిజెపి సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు.