ప్రజా సంక్షేమ, ప్రగతి కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్కొన్నారు. మందమర్రిలో గురువారం ఆయన మాట్లాడుతూ లగచర్లలో అధికారులపై దాడులు చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం పై పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు దాడులకు ప్రేరేపిస్తున్నారన్నారు.