మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో ఏర్పాటు చేసిన 'మంచి మంచిర్యాల' అక్షరాలను దొంగిలించిన వారిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంగళవారం డిమాండ్ చేశారు. పట్టణ సుందరీకరణలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో మంచిర్యాల ప్రజలందరికీ మంచి జరగాలని 'మంచి మంచిర్యాల'అనే అక్షరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ అక్షరాలను సైతం దొంగిలించిన వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.