పెండింగ్లో ఉన్న ఉద్యోగుల డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో నిర్వహించిన ఆఫీస్ బేరర్స్ జిల్లా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, వేణుతో కలిసి ఆయన మాట్లాడారు. గురుకుల, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరారు.