ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి: జిల్లా సంక్షేమ అధికారి

52பார்த்தது
ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలి: జిల్లా సంక్షేమ అధికారి
పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూప బుధవారం అన్నారు. బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడి సెంటర్లో ఐదు సంవత్సరాలలోపు పిల్లల బరువు, ఎత్తు వివరాలను సేకరించారు. బరువు తక్కువ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు డాక్టర్ ఇవాంజిలేనా సలహాలు, సూచనలు చేశారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్‌ పుష్పలత, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி