గీతా కార్మికుల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు విశేష కృషి చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. నెన్నెల మండలానికి చెందిన పలువురు గీత కార్మికులకు ఎమ్మెల్యే కాటమయ్య రక్షా కిట్లను అందజేశారు. ఏ ప్రభుత్వం కూడా గీతా కార్మికుల కోసం ఈ కిట్లను పంపిణీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వం గీతా కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.