రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు.