కాసిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ
ఆవరణలో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీని మహిళలు తిరస్కరించారు. పంపిణీ కోసం చీరల మూట విప్పగా దుర్వాసన రావడంతో మహిళలు అవి మాకొద్దంటూ వెళ్లి పోయారు. గత ప్రభుత్వంలో మిగిలిన చీరలకు కాంగ్రెస్ ప్రభుత్వం లేబుళ్లను మాత్రమే మార్చి పెట్టారని మహిళలు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.