ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 23 వ వార్డు స్టేషన్ రోడ్డు కాలనీ , 22వ వార్డు బూడిదగడ్డ బస్తీలలో మంగళవారం ఆయన పర్యటించారు. ఇంటింటి కుటుంబ సభ్యుల భాగంగా గుర్తించబడిన ఇండ్లు అతికించిన స్టిక్కర్లను పరిశీలించారు. సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.