లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను వెంటనే అందజేయాలని ఎంసీపీఐయు నాయకులు రాజేంద్రప్రసాద్, వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పక్షం రోజులు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సమావేశం పెట్టి అందజేస్తారని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు.