బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు కోల్పోయిన భీమయ్య కుటుంబాన్ని శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .