బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేశామని త్వరలోనే టెండర్ పిలిచి నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన అంబేద్కర్ భవన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరుతూ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆర్డీవో తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.