హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాన్ ఘాట్‌లోని మణికంఠ టింబర్ డిపోలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది.