కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమించిన నాయకుడు బీటీ రణదీవే అని సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. ఆదివారం రణదీవే వర్ధంతి సభను వనపర్తిలోని సీఐటీయూ సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రణదీవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మదన్, రాములు, బాలరాజు, నరేశ్ పాల్గొన్నారు.