విద్యుత్ వైర్ చోరీ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు వనపర్తి జిల్లా పట్టణ ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని తిరుమల కాలనీలో ఈ నెల 2తేదీన అర్ధరాత్రి హరీష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న కరెంటు వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన యాదగిరి, నవీన్, చిన్న, గిరిధర్లను గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.