వనపర్తి జిల్లా కేంద్రంలోని 'సఖి సెంటర్' ను మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. సఖి కేంద్రం నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రానికి బాధితులకు సరైన సేవలు అందించాలని ఆదేశించారు. లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, సంబంధిత అధికారి లక్ష్మమ్మ, సఖి కేంద్ర బాధ్యులు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు.