మొట్టమొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడుతూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమస్ఫూర్తి, పోరాటజ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని చిన్నారెడ్డి కొనియాడారు.