గురుకుల కళాశాల బాలికలను అభినందించిన ప్రిన్సిపల్

54பார்த்தது
గురుకుల కళాశాల బాలికలను అభినందించిన ప్రిన్సిపల్
వనపర్తి జిల్లా కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు నందిని, లక్ష్మి 6వ జూనియర్ ఇంటర్ డిస్టిక్ తెలంగాణ ఛాంపియన్షిప్ హైదరాబాద్ లోని బోడుప్పల్ నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్, వాలీబాల్ పోటీలలో ప్రథమస్థానం పొందారు. ఇరువురు బాలికలను కొత్తకోట సాంఘిక సంక్షేమ కళాశాల ప్రిన్సిపల్ మాధవి సోమవారం అభినందించారు. బాలికలను అభినందించిన వారిలో కళాశాల సిబ్బంది స్వప్న, భారతి ఉన్నారు.

தொடர்புடைய செய்தி