నవంబర్ 15న అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు నారాయణపేట నుండి ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. 13న సాయంత్రం 7 గంటలకు బయలుదేరి కాణిపాకం విఘ్నేశ్వరుడు, వెల్లూరు శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. 15న సాయంత్రం అక్కడి నుండి బయలుదేరుతుందని చెప్పారు. ఒక్కరికి రూ. 3, 900 ఛార్జీ వుంటుందన్నారు.