దామరగిద్ద మండలం క్యతన్ పల్లిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని డిఎస్పీ లింగయ్య బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల వద్ద వున్న సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించాలని అన్నారు.