నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను బుధవారం పివైఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కాశీనాథ్, పిఓడబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పారు.