ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ కోడేర్ మండల కార్యదర్శి నర్సింహ్మా అన్నారు. సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులకు ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈనెల 26న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడుతునట్లు ఆదివారం వివరించారు.