సీఎం రేవంత్ రెడ్డి శనివారం దసరా పండుగ రోజున సీఎం హోదాలో తొలిసారిగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పరిశీలిస్తూ పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.